Page Loader
నాన్న వైస్ కెప్టెన్ అని మెసేజ్ పంపాడు : సూర్యకుమార్ యాదవ్
సూర్య కుమార్ యాదవ్

నాన్న వైస్ కెప్టెన్ అని మెసేజ్ పంపాడు : సూర్యకుమార్ యాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2022
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20లో విధ్వంసకర బ్యాట్య్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది మంచి జోష్ ఉన్నారు. టీమిండియాలో అద్భుతంగా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక ఆట శైలి ఉందని నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై సూర్యకుమార్ స్పందించాడు.. ఇదంతా కలగా ఉంది. వైస్ కెప్టెన్ ఎంపికైన విషయాన్ని నా తండ్రి పంపిన మెసేజ్ ద్వారా తెలిసింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. తన తండ్రి జట్టు జాబితాతోపాటు.. ఓ మెసేజ్‌ కూడా పంపారు. 'నువ్వు ఏమాత్రం ఒత్తిడికి లోనుకావద్దు. నీ బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేయ్‌' అని ఉందని పేర్కొన్నారు.

సూర్యకుమార్ యాదవ్

టీ20 ర్యాకింగ్‌లో సూర్య ఆగ్రస్థానం

సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది అదిరిపోయే రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 31 మ్యాచ్‌లు ఆడి, రెండు సెంచరీలు, 9 అర్ధ శతకాలు చేశాడు. 187 స్ట్రైక్ రేటుతో 1164 పరుగులు చేశాడు. శ్రీలంకతో జనవరి 3 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఎంపికకాగా.. వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. తాను ఎప్పుడూ బ్యాటింగ్‌కు వచ్చినా ఆ భారాన్ని మైదానం వరకు తీసుకురాను. హోటెల్, నెట్స్‌లోనే వదిలేసి వస్తానని చెప్పారు. మ్యాచ్లో తన ఆటను మాత్రమే ఆస్వాదిస్తానని స్పష్టం చేశాడు. బాధ్యతాయుతంగా ఉండటానికి కొంచెం ఒత్తిడి అవసరమేనని అన్నాడు.