LOADING...
PBKS vs LSG: ప్లే ఆఫ్స్ కు చేరువలో పంజాబ్.. లక్నో హ్యాట్రిక్స్ ఓటమి
ప్లే ఆఫ్స్ కు చేరువలో పంజాబ్.. లక్నో హ్యాట్రిక్స్ ఓటమి

PBKS vs LSG: ప్లే ఆఫ్స్ కు చేరువలో పంజాబ్.. లక్నో హ్యాట్రిక్స్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
12:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 18లో పంజాబ్‌ కింగ్స్‌ తమ ఏడో విజయాన్ని నమోదు చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై 37 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ అద్భుత ఆటతీరుతో జట్టుకు శుభారంభం అందించాడు. అతను 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో 91 పరుగులు సాధించగా, పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 236 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. ఆయుష్ బదోనీ (74), అబ్దుల్ సమద్‌ (45) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

Details

వద

మిచెల్ మార్ష్ డకౌట్ కాగా, మార్‌క్రమ్ (13), నికోలస్ పూరన్ (6), రిషభ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ (11) మాత్రమే కొంతమేర పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మెరుపు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 16 పరుగులే ఇచ్చాడు. ఒమర్జాయ్‌ 2 వికెట్లు తీసినప్పటికి చాహల్‌, యాన్సన్‌లకు ఒక్కొక్క వికెట్‌ దక్కింది. ఈ విజయంతో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఒక వర్షాభాతంలో రద్దయిన మ్యాచ్‌తో కలిపి పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి.

Details

నమన

లఖ్‌నవూకు ఇదే మ్యాచ్‌లో ఆరో ఓటమిగా నమోదైంది. పంజాబ్ బ్యాటింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), జోష్ ఇంగ్లిస్‌ (30), శశాంక్ సింగ్‌ (33), స్టాయినిస్‌ (15; 5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌), నేహల్ వధేరా (16\*; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. లఖ్‌నవూ బౌలర్లలో ఆకాశ్ మహారాజ్‌ సింగ్, దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ చెరో రెండు వికెట్లు తీసినా, ప్రిన్స్ యాదవ్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇదిలా ఉండగా, పంజాబ్ ఈ విజయంతో టోర్నీలో తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను బలోపేతం చేసింది.