ఓడినా రేసులోనే పంజాబ్.. సన్ రైజర్స్ గెలుపు కోసం చైన్నై, లక్నో ప్రార్థనలు
ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడినా పంజాబ్ కింగ్స్ ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇంకా ఆరు లీగ్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా మూడు ఫ్లేఆఫ్స్ స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్ సాంకేతికంగా ఇంకా రేసులోనే నిలిచింది. అదే విధంగా 15 పాయింట్లతోనే నేరుగా ఫ్లేఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవాలని చైన్నై, లక్నో జట్లు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. చివరి మ్యాచులో రాజస్థాన్ పై గెలవడంతో పాటు ఇతర జట్ల గెలుపోటములపై పంజాబ్ ఆధారపడి ఉంది.
పంజాబ్ కింగ్స్ ఫ్లే ఆఫ్స్ కి చేరే మార్గమిదే!
నాలుగో స్థానంలో పంజాబ్ నిలవాలంటే రెండు టీమ్స్ తో పోటీ పడాల్సి ఉంటుంది. పంజాబ్ గెలవడంతో పాటు ఆర్సీబీ, కోల్ కతా నైట్ రైడర్స్ తమ తర్వాతి మ్యాచులలో ఓడిపోవాలి. అప్పుడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కి సమానంగా పాయింట్లు ఉంటాయి. పంజాబ్ చివరి మ్యాచులో 20 పరుగుల తేడాతో గెలిచి, ముంబై 26 పరుగుల తేడాతో ఓడితే పంజాబ్ ఫ్లేఆఫ్స్ కి చేరే అవకాశం ఉంటుంది. సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోతే చైన్నై, లక్నో నేరుగా ఫ్లేఆఫ్స్ కి అర్హత సాధిస్తాయి. అదే జరిగితే ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచులో ఎలా గెలిచినా ఫ్లేఆఫ్స్ కి చేరే అవకాశం ఉంటుంది.