IPL 2026: అందుకే 6 నెలలు మందు మానేశా..చాహల్ షాకింగ్ కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026ను దృష్టిలో ఉంచుకుని, అతను తన జీవనశైలిలో కీలక మార్పులు చేసుకున్నాడు. ఇటీవల కాలంలో గాయాలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన చాహల్, ఈసారి మాత్రం తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన చాహల్.. తాను గత ఆరు నెలలుగా మద్యం పూర్తిగా మానేశానని అన్నారు. ప్రస్తుతం తనకు 35 ఏళ్లని, తన జట్టుకోసం మైదానంలో 150 శాతం శక్తిని వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాడు.
వివరాలు
అప్పుడే సరిగా బౌలింగ్ చేయలేకపోయా..
గత ఐపీఎల్ సీజన్లలో చాహల్ మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ, ట్రోఫీ మాత్రం అందకుండా పోయింది. 2013లో ముంబై ఇండియన్స్ తరపున టైటిల్ గెలిచిన తరువాత, ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్, అలాగే గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ, చివరికి కప్ దక్కలేదు. గత సీజన్ చివర్లో ఎదురైన గాయాలు తన ఆటపై ప్రతికూల ప్రభావం చూపాయని చాహల్ వెల్లడించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం రిబ్ ఫ్రాక్చర్, అలాగే వేళ్ల గాయం కారణంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో తాను పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయానని ఆయన గుర్తుచేసుకున్నాడు.