Punjab Kings: ఐపీఎల్ 2025 కోసం కొత్త స్పాన్సర్.. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపిన పంజాబ్ కింగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ పూర్తి డిజిటల్ బీమా ప్రొవైడర్ 'క్షేమ జనరల్ ఇన్సూరెన్స్' తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కోసం అధికారిక జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామిగా క్షేమను ప్రకటించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి మార్గదర్శక బీమా పరిష్కారాలను రూపొందిస్తున్న 'క్షేమ జనరల్ ఇన్సూరెన్స్' క్రికెట్ రంగంలోకి అడుగుపెడుతోంది.
అత్యాధునిక ఏఐ-ఆధారిత అల్గోరిథంలు, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటివి ఉపయోగించి, భీమా నష్టాలను ఖచ్చితంగా అంచనా వేసేందుకు క్షేమ తన సొంత సాంకేతిక వేదికను అభివృద్ధి చేసింది.
అభిమానులతో మరింత అనుబంధాన్ని పెంపొందించేందుకు 'క్షేమా సెక్యూర్ హ్యాండ్స్' అనే ప్రత్యేక డిజిటల్ ఐపీ సృష్టించనున్నారు.
Details
సంతోషంగా ఉంది: సీఎంఓ భాస్కర్
ఇందులో ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రతి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన (క్యాచ్ టేకెన్, రన్ సేవ్, రనౌట్ లేదా స్టంపింగ్ ఎఫెక్ట్) హైలైట్ చేయనున్నారు.
క్షేమా విశ్వాసం, విశ్వసనీయత, రక్షణ తత్వాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ సీఎంఓ భాస్కర్ ఠాకూర్ పేర్కొన్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టుతో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందని, వారి అభిమానులకు క్రికెట్ ద్వారా సంతోషం అందించడమే కాకుండా, తమ పరిశ్రమలో బీమా ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు వీలు ఉంటుందని పేర్కొంది.
ఐపీఎల్ ద్వారా దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను చేరుకోవడానికి, బీమా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇది గొప్ప అవకాశం అని తెలిపారు.
Details
పరస్పర వృద్ధికి సహకారం
పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ మాట్లాడుతూ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని, పరస్పర వృద్ధికి ఈ సహకారం సహాయపడుతుందనే నమ్మకం ఉందన్నారు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులతో అనుబంధాన్ని పెంచేందుకు క్షేమ 360-డిగ్రీల ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తోందన్నారు.
ఇటీవల హైలాండ్, అవాన్ సైకిల్స్, ఫ్రీమాన్స్ సంస్థలు కూడా పంజాబ్ కింగ్స్ స్పాన్సర్‌లుగా చేరాయి. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ 2025లో ట్రోఫీ గెలవాలనే భావిస్తోంది.