
Punjab Kings : ఐపీఎల్ వేలంలో పొరపడిన పంజాబ్ కింగ్స్.. ఒక ఆటగాడి బదులు మరొకరిని!
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం మంగళవారం ఆటగాళ్ల వేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే ఆ వేలంలో పంజాబ్ కింగ్స్ (Panjab Kings) ఫ్రాంచైజీ ఓ పొరపాటు చేసింది. అవసరం లేని ప్లేయర్ ను కొనుగోలు చేసింది. వేలం జరుగుతున్న సమయంలో ప్రీతి జింతా టీమ్ అనుకోకుండా ఈ పొరపాటు చేసింది.
వేలం చివరి దశకు చేరుకున్న సమయంలో అన్ క్యాప్‌డ్ ప్లేయర్ల బిడ్డింగ్ శరవేగంగా సాగింది.
ఈ క్రమంలో శశాంక్ సింగ్ అనే అటగాడి పేరును రూ.20లక్షల కనీస ధరతో ఆక్షనీర్ మల్లికా సాగర్ ప్రారంభించారు.
అయితే పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింతా బిడ్డింగ్ వేసినట్లు సిగ్నల్ ఇచ్చారు.
శశాంక్ ను పంజాబ్ దక్కించుకున్నట్లు ఆక్షనీర్ ప్రకటించారు.
Details
అసహనం వ్యక్తం చేసిన ప్రీతి జింతా
ఆ వెంటనే వేరే ఆటగాడి వేలానికి వెళ్లిపోయారు. ఈ సమయంలో పంజాబ్ కింగ్స్ చేసిన పొరపాటును గ్రహించింది.
ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ ప్రతినిధులు వెంటనే ఆక్షనీర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై నెస్ వాడియా, ప్రీతి జింతా కాస్త అసహనం వ్యక్తం చేశారు.
ఇది సరైన పేరు కాదా? మీరు ఆ ప్లేయర్ ను వద్దనుకుంటున్నారా? అని మల్లికా సాగర్ ప్రశ్నించింది.
దీనిపై తాము కోరుకోలేదని పంజాబ్ పేర్కొంది. దీంతో 236, 237 నంబర్ల ఆటగాళ్ల ఇద్దరూ పంజాబ్ కే అంటూ మల్లికా తెలిపింది.
అయితే తొలుత వద్దనుకున్న ఆటగాడిని పంజాబ్ కింగ్స్, చివరికి తమ జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది.