IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో పోరుకు బెంగళూర్ సై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 27వ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. రెండింట్లో నెగ్గింది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 3:30గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐపీఎల్‌లో పీబీకేఎస్, ఆర్‌సీబీ 30 సార్లు తలపడ్డాయి. ఇందులో పంజాబ్ 17 సార్లు విజయం సాధించగా.. ఆర్సీబీ 13 మ్యాచ్ ల్లో నెగ్గింది.
పంజాబ్ కింగ్స్, బెంగళూరు జట్టులోని సభ్యులు
చివరి మ్యాచ్ లో చైన్నై చేతిలో ఓడిపోయిన బెంగళూరు ఈసారి ఎలాగైనా పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించాలని భావిస్తోంది. మరోపక్క లక్నోపై రెండు వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్ గెలుపు జోష్ తో బరిలోకి దిగుతోంది పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (c), మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ (wk), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్. ఆర్సీబీ జట్టు : కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), హర్షల్ పటేల్, హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.