టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ ఈ రోజు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. రెండింట్లో నెగ్గింది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో పీబీకేఎస్, ఆర్‌సీబీ 30 సార్లు తలపడ్డాయి. ఇందులో పంజాబ్ 17 సార్లు విజయం సాధించగా.. ఆర్సీబీ 13 మ్యాచ్ ల్లో నెగ్గింది.
బెంగళూర్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ(సి), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(w), వనిందు హసరంగా, సుయాష్ ప్రభుదేసాయి, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(సి), జితేష్ శర్మ(w), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ గాయంలో డుప్లెసిస్ మ్యాచ్ కు దూరం కావడంతో ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లీ పగ్గాలు చేపట్టాడు. అటు ధావన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో శామ్ కర్రన్ పంజాబ్ కెప్టెన్ గా కొనసాగాడు.