LOADING...
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు.. ఒకే స్క్వాడ్‌లో గిల్-అభిషేక్-అర్ష్‌దీప్!
విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు.. ఒకే స్క్వాడ్‌లో గిల్-అభిషేక్-అర్ష్‌దీప్!

Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు.. ఒకే స్క్వాడ్‌లో గిల్-అభిషేక్-అర్ష్‌దీప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు తమ 18 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు చోటు దక్కించుకోవడం విశేషం. అలాగే ప్రభ్‌సిమ్రన్ సింగ్, నమన్ ధీర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, సన్వీర్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ వంటి ప్రతిభావంతులకూ అవకాశం లభించింది. అయితే గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు విజయ్ హజారే ట్రోఫీలో ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కారణం, టీమిండియా జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.

Details

జనవరి 21 తర్వాత కివీస్ తో టీ20 సిరీస్

ఆ తర్వాత జనవరి 21 నుంచి కివీస్‌తో టీ20 సిరీస్ జరగనుంది. భారత వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు టీ20 జట్టులో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టు లీగ్ దశలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు జైపూర్ వేదికగా జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, ముంబయి జట్లతో పంజాబ్ తలపడనుంది. లీగ్ మ్యాచ్‌లు జనవరి 8తో ముగియనున్నాయి. కాగా, ఈ టోర్నీకి పంజాబ్ జట్టు కెప్టెన్ ఎవరు అనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Details

 విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు 

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), హర్నూర్ పన్ను, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉదయ్ సహారన్, నమన్ ధీర్, సలీల్ అరోరా (వికెట్ కీపర్) సన్వీర్ సింగ్, రమణదీప్ సింగ్, జషన్‌ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ బ్రార్, రఘు శర్మ, క్రిష్ భగత్, గౌరవ్ చౌదరి, సుఖదీప్ బజ్వా.

Advertisement