
PBKS vs KKR: పంజాబ్ vs కేకేఆర్.. హోరాహోరీ పోరుకు సిద్ధం.. ఇవాళ గెలుపు ఎవరిదో?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.
గత మ్యాచ్‌లో 245 పరుగుల భారీ స్కోరు చేసినా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన పంజాబ్.. ఈసారి కేకేఆర్‌పై గెలిచి విజయాల బాటలోకి రావాలని భావిస్తోంది.
ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. మూడింటిలో గెలిచింది,
రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా, నెట్ రన్‌రేట్ +0.065తో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
Details
హెడ్ టు హెడ్ రికార్డు
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ విషయానికి వస్తే, తన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది.
ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ మూడు గెలిచి, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. 6 పాయింట్లతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కేకేఆర్ నెట్ రన్‌రేట్ +0.803గా ఉంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 33 సార్లు తలపడగా.. 21 మ్యాచ్‌లలో కోల్‌కతా విజయం సాధించగా, 12 మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్ ఖాతాలోకి వెళ్లాయి.
Details
పిచ్ రిపోర్ట్
చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రెండు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో హై స్కోరింగ్ మ్యాచ్‌కి వీలుంది. బౌలర్లకు సహకారం తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంతో చండీగఢ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.