ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకి చేదు అనుభవం
ఈ వార్తాకథనం ఏంటి
బర్మింగ్‌హామ్‌లో బుధవారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం ఎదరైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండు సార్లు ఒలంపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు తొలి రౌండ్లోనే నిరాశ పరిచింది.
వైఎమ్ ఝాంగ్ చేతిలో పీవీ సింధు చిత్తుగా ఓడింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు కనీసం పోటీ ఇవ్వలేక.. 17-21, 11-21 తేడాతో ఓడిపోయింది.
డబుల్ ఒలింపిక్ పతక విజేత సింధు ఈ ఏడాది తొలి రౌండ్లో ఓడిపోవడం ఇది మూడోసారి. జనవరిలో మలేషియా ఓపెన్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌తో ఓడిపోయిన ఆమె అదే నెలలో ఇండియన్ ఓపెన్‌లో ఇంటిదారి పట్టింది.
పీవీ సింధు
మారని పీవీ సింధు ఆటతీరు
తొలి గేమ్ ఆరంభంలో సింధు 6-5తో అధిక్యంలో నిలిచింది. తర్వాత 16-13 తో నిలిచి గేమ్ నెగ్గేలా కనిపించింది. అయితే ఆ సమయంలో వరుసగా 7 పాయింట్లు నెగ్గి 20-16తో అధిక్యంలోకి వచ్చిన చైనా షట్లర్ యిమన్ తొలి గేమ్ లో పైచేయి సాధించింది.
రెండు గేమ్ లో ఇద్దరు షట్లర్లు తొలుగు 5-5 సమానంగా నిలిచారు. అయితే సింధు అనవసర తప్పిదాలతో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది.
7-11తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేసినా.. చైనా షట్లర్ ఆమెకు ఆ చాన్స్ ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్ ముగించింది