Page Loader
PV Sindhu: 'చిన్నారులు,యువతలో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే లక్ష్యం '.. విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ..
విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ

PV Sindhu: 'చిన్నారులు,యువతలో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే లక్ష్యం '.. విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

"బ్యాడ్మింటన్ క్రీడలో ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభను ప్రదర్శించేటట్లు తీర్చిదిద్దడమే తన ముఖ్య లక్ష్యమని ప్రముఖ క్రీడాకారిణి పివి.సింధు అన్నారు. విశాఖపట్నంలోని పెద గదిలి కూడలి సమీపంలో, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మించేందుకు ఆమె తన తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేశారు. అకాడమీ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి, ఏడాది రోజుల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ విధానం, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు సుమారు మూడెకరాల భూమిని కేటాయించిందని తెలిపారు."

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పివి.సింధు చేసిన ట్వీట్