Loading...
PV Sindhu: జపాన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
జపాన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

PV Sindhu: జపాన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన చెన్ యుఫీయ్ గాయంతో మధ్యలోనే వైదొలగడంతో సింధు విజయం ఖరారైంది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడగా, తొలి గేమ్‌లో ఒక దశలో స్కోరు 18-18తో సమంగా నిలిచింది. అయితే కీలక సమయంలో అద్భుత ఆటతీరును ప్రదర్శించిన సింధు వరుస పాయింట్లు సాధించి 21-19తో తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

వివరాలు

ఆధిక్యంలో సింధు..

రెండో గేమ్‌లో కూడా సింధు ఆధిపత్యం కొనసాగించింది. విరామ సమయానికి 11-7తో ముందంజలో ఉన్న ఆమె, తర్వాత స్కోరును 15-10కు చేర్చింది.

ఇదే సమయంలో తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడిన చెన్ యుఫీయ్ మ్యాచ్‌ను కొనసాగించలేక రిటైర్ కావడంతో సింధు ఫైనల్‌కు చేరుకుంది.

2024లో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ అనంతరం పీవీ సింధు ఏ అంతర్జాతీయ టోర్నీలోనైనా ఫైనల్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఆదివారం జరిగే టైటిల్ పోరులో సింధు, జపాన్‌కు చెందిన అకానె యమగూచితో తలపడనుంది.

ఇరువురి మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల రికార్డులో యమగూచి 14-10తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ADVERTISEMENT