Page Loader
PV Sindhu: సయ్యద్‌ మోదీ టోర్నీలో పి.వి.సింధు విజయం
సయ్యద్‌ మోదీ టోర్నీలో పి.వి.సింధు విజయం

PV Sindhu: సయ్యద్‌ మోదీ టోర్నీలో పి.వి.సింధు విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో భారత షట్లర్లు దుమ్మురేపారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ పివి.సింధు చైనా షట్లర్ వు లుయో యు ను 21-14, 21-16 స్కోరుతో ఓడించి విజయం సాధించింది. ఈ విజయంతో సింధు రెండు సంవత్సరాల తర్వాత తన తొలి అంతర్జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2022 జులైలో సింగపూర్‌ ఓపెన్‌లో ఆమె చివరిసారి టైటిల్ గెలిచింది. సయ్యద్‌ మోదీ టోర్నీలో ఇది సింధుకు మూడో టైటిల్, ముందుగా 2017, 2022లో కూడా ఈ టైటిల్‌ను సాధించింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ లక్ష్యసేన్‌ 21-6, 21-7తో సింగపూర్‌ షట్లర్ జియా హెంగ్‌ జేసన్‌ను చిత్తుచేశాడు.

Details

మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌ గెలుపు

లక్ష్యసేన్‌ కేవలం 31 నిమిషాల్లో ఈ విజయాన్ని సాధించాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ 21-18, 21-11తో చైనా జోడీని ఓడించి సయ్యద్‌ మోదీ టైటిల్‌ను తొలిసారి అందుకుంది. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ రాయ్‌-సాయి ప్రతీక్‌ జోడీ రన్నరప్‌గా నిలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల్-తనీషా క్రాస్టో జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటికే అనేక విజయాలను సాధించిన పివి.సింధు, 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ లో పాల్గొని మరింత ఘనత సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది.