LOADING...
<span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">PV sindhu: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌‌లో సింధు విజయం</span>
ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌‌లో సింధు విజయం

PV sindhu: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌‌లో సింధు విజయం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 03, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ పివి.సింధు అద్భుత విజయాన్ని కైవశం చేసుకున్నారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో పి.వి.సింధు 25-23, 21-16తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)ను మట్టికరిపించారు. మొదటి ఆటలోనే ప్రత్యర్థి నుంచి సింధుకు గట్టిపోటీ ఎదురైనా ఆమె అడ్గుకున్నారు. ఒక దశలో 23-23తో స్కోర్లు సమానంగా నిలిచాయి. కీలక సమయంలో ఒత్తిడికి లోనవకుండా సింధు ముందుకు నడిచి రెండు పాయింట్లను దక్కించుకున్నారు. దీంతో ఆమె తొలి గేమ్‌లో విజయం సాధించారు. రెండో గేమ్‌లో సింధు దూకుడుగా ఆడుతూ తేలిగ్గా విజయం సాధించారు. రెండో రౌండ్లో ఆన్‌ సియాంగ్‌ (కొరియా)తో సింధు తలపడనున్నారు.

వివరాలు

పురుషుల సింగిల్స్‌లో ఎవరు గెలిచారంటే?

గత తొమ్మిది మ్యాచ్‌ల్లో సియాంగ్‌పై భారత షట్లర్‌ గెలవకపోవడం విశేషంగా చెప్పొచ్చు. మరో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్‌ 12-21, 10-21తో పోర్న్‌పావి (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్‌ కథ తొలి రౌండ్లోనే ముగియగా లక్ష్యసేన్‌ 19-21, 16-21తో ఫర్హాన్‌ (ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్‌-ఎంఆర్‌ అర్జున్‌ జంట రెండో రౌండ్‌‌కు చేరారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జంట 14-21, 12-21తో కుసుమ-త్రియాస్‌ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓటమిపాలైంది.

Advertisement