WTC 2025-27: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రేస్.. భారత్‌కు ఇక ప్రతి టెస్ట్ 'డూ ఆర్ డై'!
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన చేదో ఓటమితో భారత జట్టు (Team India) భారీ దెబ్బతినింది. విజయానికి అతి సమీపంలో ఉండి పరాజయం పాలవ్వడం గిల్ సేనను కుదేలు చేసింది. స్వదేశంలో దాదాపు అజేయంగా ఉండే భారత్ ఇలా ఓటమి చవిచూడటం క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) సైకిల్‌లో ఫైనల్ రేసులో నిలవాలంటే ఇకపై టీమ్‌ఇండియా ప్రతి మ్యాచ్‌ను తుది పోరాటంలా తీసుకోవాల్సిందే. ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో భారత్ అత్యధికంగా 8 మ్యాచులు ఆడింది. ఏ జట్టూ ఇంకా ఇంతటి సంఖ్యలో టెస్టులు ఆడలేదు.
Details
అవకాశాలు సజీవమే… కానీ ఒత్తిడి ఎక్కువ!
భారత్ తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఉండగా, వారు కేవలం 5 మ్యాచులే పూర్తి చేశారు. కానీ భారత్ ఆడిన 8 టెస్టుల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించగా, 3 మ్యాచుల్లో ఓటమి, ఒకటిలో డ్రా నమోదైంది. ఇప్పుడు టీమ్‌ఇండియా చేతిలో ఉన్నవి మరి 10 మ్యాచ్‌లే. ప్రస్తుతం టీమ్‌ఇండియా నాలుగో స్థానంలో 54.17 పాయింట్ల పర్సంటేజ్ (PCT)తో ఉంది. మనకంటే ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు నిలిచాయి. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ కనీసం 64-68 శాతం పర్సంటేజ్‌ను పొందాల్సిందే. అంటే ఇక ప్రతి టెస్ట్ మ్యాచ్‌ను గెలవడానికి జట్టు మరింతగా చెమటోడ్చాల్సి ఉంటుంది.
Details
కఠినమైన షెడ్యూల్ ముందుంది
ముందున్న 10 టెస్టుల్లో భారత్ దక్షిణాఫ్రికా - 1 టెస్ట్ శ్రీలంక - 2 టెస్టులు న్యూజిలాండ్ - 2 టెస్టులు ఆస్ట్రేలియా - 5 టెస్టులు వీటిలో 6 టెస్టులు స్వదేశంలో జరగనున్నాయి. ఒకప్పుడు ఇండియా హోమ్‌గ్రౌండ్‌లో అజేయంగా ఉండేది. కానీ పరిస్థితి మారిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, తాజాగా కోల్‌కతా టెస్ట్‌లో ఎదురైన ఓటమి హోమ్ అద్వాంటేజ్ కూడా పరిమితమైందనే సందేశాన్ని ఇస్తోంది.
Details
WTC ఫైనల్‌కు చేరాలంటే ఎంత గెలవాలి?
ఈ 10 మ్యాచుల్లో భారత్ ఎంత గెలిస్తే అర్హత రేసులో నిలుస్తుందో లెక్క ఇలా ఉంది. 10 గెలిస్తే → 172 పాయింట్లు, 79.63% 9 గెలిస్తే → 160 పాయింట్లు, 74.07% 8 గెలిస్తే → 148 పాయింట్లు, 68.52% 7 గెలిస్తే → 136 పాయింట్లు, 62.96% 6 గెలిస్తే → 124 పాయింట్లు, 57.41% 5 గెలిస్తే → 112 పాయింట్లు, 51.85% గత రెండు WTC సైకిళ్లను పరిశీలిస్తే, ఫైనల్ ఆడిన జట్ల పర్సంటేజ్ సాధారణంగా 65% పైనే ఉంది.
Details
8 టెస్టులు గెలవాలి
కాబట్టి టీమ్‌ఇండియా కనీసం 8 టెస్టులు గెలవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఉన్న ప్రతి పోరాటం గిల్ సేనకు పరీక్షే. ఫామ్, ఫిట్‌నెస్, బ్యాటింగ్, బౌలింగ్ - అన్ని విభాగాల్లోనూ సరిచేసుకుని దూకుడు చూపించాల్సిన సమయం వచ్చింది. ఇండియా WTC ఫైనల్ బరిలో నిలుస్తుందా? లేక మధ్యలోనే తడబడుతుందా? అనేది రాబోయే మ్యాచులపై ఆధారపడి ఉంటుంది.