తదుపరి వార్తా కథనం

Rafael Nadal: ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 10, 2024
04:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రొఫెషనల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ (Rafael Nadal) తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.
నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని ఆయన వెల్లడించారు.
'క్లే కోర్టు' రారాజుగా పేరుపొందిన నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించారు.
2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశించిన నాదల్, కేవలం నాలుగు సంవత్సరాల్లోనే (2005-ఫ్రెంచ్ ఓపెన్) తన తొలి టైటిల్‌ను సాధించి, క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించారు.
ఇప్పటివరకు తన కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న ఈ స్పెయిన్ బుల్, వీటిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్
Rafael Nadal has announced his retirement from professional tennis 🎾🚨 pic.twitter.com/AeDqa5pII0
— Sky Sports Tennis (@SkySportsTennis) October 10, 2024