Page Loader
Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. కారును ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం (వీడియో ) 
రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. కారును ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం (వీడియో )

Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. కారును ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం (వీడియో ) 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్, టీ20 ప్రపంచకప్ 2024 విజేత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాహుల్ ద్రవిడ్ ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు ఆందోళన చెందారు.

అయితే, ఈ ప్రమాదంలో రాహుల్ ద్రవిడ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అయితే ఈ ప్రమాదం అనంతరం ద్రవిడ్, ఆటో డ్రైవర్‌తో స్వల్ప వాగ్వాదానికి దిగారు.

వివరాలు 

 వైరల్‌ గా వీడియో  

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, ఈ ప్రమాదానికి కారణం ద్రవిడ్ డ్రైవింగ్‌లో నిర్లక్ష్యమా? లేక ఆటో డ్రైవర్ పొరపాటా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

చిన్న ప్రమాదమే కావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఎటువంటి ఫిర్యాదు నమోదుకాలేదు.

2021లో రాహుల్ ద్రవిడ్ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. అతని కోచింగ్‌లో టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్‌గా ఘటన వీడియో