Samit Dravid: రాహుల్ ద్రావిడ్ అడుగుజాడల్లో కొడుకు.. అండర్-19 జట్టుకు సమిత్ ద్రావిడ్ ఎంపిక
రాహుల్ ద్రావిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ తన తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌లో ముందుకు సాగుతున్నారు. కర్ణాటకలో తన ప్రతిభను చాటుకున్న సమిత్, తాజాగా అండర్-19 భారత జట్టులో చోటు లభించింది. పుదుచ్చేరి, చెన్నై వేదికగా సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమవుతున్న ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతడు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగుతాయి. కేఎస్‌సీఏ మహరాజా టీ20 ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ అద్భుతంగా రాణించాడు. ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్‌ల్లో 82 పరుగులు చేశాడు. అయితే ఈ టోర్నీలో అతడికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.
కూచ్‌బెహర్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించిన సమిత్ ద్రావిడ్
ఈ ఏడాది జరిగిన కూచ్‌బెహర్ ట్రోఫీలో సమిత్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో 362 పరుగులతో పాటు, 16 వికెట్లు సాధించి కర్ణాటక విజయంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. వన్డే జట్టు మహ్మద్ అమన్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, నాలుగు రోజుల మ్యాచ్‌లకు సోహమ్ పట్వార్ధన్ నాయకత్వం వహిస్తాడు. వన్డే జట్టు మహ్మద్ అమన్ (కెప్టెన్), రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్), సాహిల్ పరేఖ్, కార్తికేయ కేపీ, కిరణ్ చోర్మలె, అభిగ్యాన్ కుందు, హర్వన్ష్ సింగ్, సమిత్ ద్రవిడ్, యుధజిత్ గుహ, సమర్థ్ ఎన్, నిఖిల్ కుమార్, ఛేతన్ శర్మ, హార్దిక్ రాజ్, రోహిత్ రజావత్, మహ్మద్ ఇనాన్.