
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రాజీనామాలను ఆమోదించిన రైల్వేశాఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తాజాగా, భారత రైల్వే శాఖ సోమవారం ఈ రాజీనామాలను ఆమోదించింది. వినేశ్, పూనియా రాజీనామాలను ఆమోదించినట్టు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
అదనంగా, రిజైన్ చేసేటప్పుడు ఇవ్వాల్సిన 3 నెలల నోటిస్ పీరియడ్‌ను కూడా మాఫీ చేసినట్లు పేర్కొంది.
ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో,సర్వీస్ రూల్స్ ప్రకారం నోటీసులు ఇచ్చారు.ఆ నోటీసుల తర్వాతే ఈ ఇద్దరు రెజ్లర్లు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా సమర్పించారు.
వినేశ్ ఫోగట్ నార్తర్న్ రైల్వేస్‌లో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ (OSD)గా పనిచేశారు,అలాగే భజరంగ్ పూనియా కూడా అదే రోల్‌లో ఉన్నారు.
వివరాలు
వినేశ్ ఫోగట్‌కు జులానా అసెంబ్లీ సీటు
తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ ఇద్దరు రెజ్లర్లు త్వరలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.
ఇప్పటికే వినేశ్ ఫోగట్‌కు జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీటు కేటాయించినట్లు సమాచారం.
ఇకపోతే, గత నెలలో ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల ఫ్రీస్టైల్ కేటగిరీలో వినేశ్ ఫోగట్ అనర్హతకు గురయ్యారు.
తుది పోటీకి కొన్ని గంటల ముందు, కేవలం 100 గ్రాముల అధిక బరువుతో ఆమె అనర్హతకు గురై, పతకం గెలిచే అవకాశం కోల్పోయారు.