LOADING...
IND w Vs PAK w: కొలంబోలో వర్షం.. భారత్ - పాక్ మ్యాచ్‌పై ప్రభావం ఉంటుందా? 
కొలంబోలో వర్షం.. భారత్ - పాక్ మ్యాచ్‌పై ప్రభావం ఉంటుందా?

IND w Vs PAK w: కొలంబోలో వర్షం.. భారత్ - పాక్ మ్యాచ్‌పై ప్రభావం ఉంటుందా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తాజాగా ఆసియా కప్‌లో మూడు సార్లు ఎదురైన టీమిండియా - పాకిస్థాన్‌ జట్లు ఇప్పుడు మళ్లీ హిళల వన్డే వరల్డ్ కప్‌లో తలపడనున్నాయి. అభిమానుల్లో ఉత్కంఠ రేగిస్తోంది. కొలంబోలో వాతావరణం ఎలా ఉంటుందో, వర్షం కారణంగా మ్యాచ్‌ జరుగుతుందా అనే సందేహం కూడా ఉంది. శనివారం జరగాల్సిన ఆసీస్‌ - శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఆక్యూవెదర్‌ రిపోర్ట్‌ ప్రకారం, భారత్ - పాక్ మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు భారత కాలమానం ప్రకారం జరుగుతుందని అంచనా. టాస్‌ 2:30కి వేయనున్నారు. ప్రస్తుతం కొలంబోలో వర్షం పడుతున్నప్పటికీ, మ్యాచ్‌ సమయానికి ఆగే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Details

ఓపెనర్లు రాణించాలి

మైదానం సిద్ధం కావడానికి కొద్దిగా ఆలస్యం కావచ్చు, వరల్డ్ కప్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచింది, అయితే ఓపెనర్లు స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్ నిరాశపరిచారు. కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ కూడా ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉండలేదు. ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వీరు రాణించినా, వరల్డ్ కప్‌లో మాత్రం ఓపెనర్లు బాగా ప్రదర్శించలేదని పేర్కొనవచ్చు. అయితే లోయర్ ఆర్డర్‌లో కూడా పరుగులు సాధించగలిగిన ధైర్యాన్ని భారత ప్లేయర్లు చూపించారు. ఇప్పుడు పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఒత్తిడి సహజం.

Details

కరచనాలు చేయకూడదు

ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధాన బాగా భాగస్వామ్యం నిర్మించాలి. భారీ స్కోరు సాధించి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టడం టీమ్‌ఇండియా లక్ష్యం. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో పాక్ కష్టాల్లో పడింది. ఈసారి మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది, కాబట్టి భారత ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. భారత్, పాక్ ప్లేయర్లు ఒకరినొకరు ఆలింగనం లేదా కరచనాలు చేయకూడదని బీసీసీఐ స్పష్టత ఇచ్చింది.