Loading...
India vs New Zealand 3rd ODI: మ్యాచ్‌నే ఆడేసిన వరుణుడు.. భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు
మ్యాచ్‌నే ఆడేసిన వరుణుడు.. భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు

India vs New Zealand 3rd ODI: మ్యాచ్‌నే ఆడేసిన వరుణుడు.. భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మూడో వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారాడు. గత రెండు వన్డేల్లో అడపాదడపా వచ్చి ఇబ్బంది పెట్టిన వర్షం.. ఈసారి ఏకంగా మ్యాచ్‌నే రద్దు చేయించింది. హామిల్టన్ వేదికగా జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. టాస్ గెలిచిన భారత్.. వర్షంతో ఆటకు అంతరాయం ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమ్‌ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా సాధ్యపడుతుందని అభిమానులు ఆశించినప్పటికీ.. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. చివరికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

వివరాలు

సిరీస్‌పై భారత్‌కు మరో అవకాశం

మూడో వన్డే రద్దు కావడంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ 2-0తో ముందంజలో ఉంది.

మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడితే సిరీస్ 2-2తో సమమవుతుంది.

ADVERTISEMENT