టాప్ 3లోకి రాజస్థాన్.. దిగజారిన కోల్‌కతా నైట్ రైడర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పాయింట్ల పట్టికలో కోల్ కతాపై రాజస్థాన్ విజయం సాధించి మూడో స్థానానికి ఎగబాకింది.
కోల్ కతా నైట్ రైడర్స్ ను గురువారం రాజస్థాన్ చిత్తుగా ఓడించి ఫ్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
మరోపక్క కేకేఆర్ ఫ్లేఆఫ్ ఆశలను వదలుకుంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లోనే రాజస్థాన్ చేజ్ చేసింది.
యశస్వీ జైస్వాల్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ లో రికార్డును బ్రేక్ చేశాడు. రాజస్థాన్ 12 మ్యాచ్ లలో 6 విజయాలు, 6 ఓటములతో మూడో స్థానానికి చేరింది.
తొలి రెండు స్థానాల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతున్నాయి.
Details
పర్పుల్ క్యాప్ లీడ్ లో చాహల్
ఈడెన్ గార్డెన్స్ లో పరుగుల వరద పారించిన యశస్వీ జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ జాబితాలో రెండో స్థానానికి చేరాడు. 576 పరుగులతో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అగ్రస్థానంలో కొనసాగతుండగా.. యశస్వీ 575 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.
గిల్(469), డెవెన్ కాన్వే (468), విరాట్ కోహ్లీ (420) పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచారు.
పర్పుల్ క్యాప్ విషయానికొస్తే ఆర్ఆర్ బౌలర్ చాహల్ టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లాడు. కేకేఆర్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన చాహల్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఈ సీజన్ లో 21 వికెట్లతో చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. షమీ(19), రషీద్ ఖాన్ (19), దేశ్ పాండే (19), చావ్లా(17) వికెట్లు తీశారు.