
టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లిన రాజస్థాన్.. ఆరెంజ్ క్యాప్ లీడ్‌లో ఆర్సీబీ ప్లేయర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జైపూర్ లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
అంతకుముందు మొదటి స్థానంలో ఉన్న చైన్నై.. ప్రస్తుతం మూడో స్థానానికి దిగజారింది. రాజస్థాన్ 8 మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో పది పాయింట్ల సాధించింది. దీంతో మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా మొదటి స్థానాన్ని అక్రమించింది.
గుజరాత్, చైన్నై జట్లకు పది పాయింట్లు ఉన్నా నెట్ రన్ రేట్ హెచ్చుతగ్గులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు పరాజయాలతో చివరి స్థానంలో కొనసాగుతోంది.
Details
422 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్ అగ్రస్థానం
ఇక చైన్నై, రాజస్థాన్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ టాప్ 3లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
422 పరుగులతో ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మొదటి స్థానంలో ఉండగా.. 333 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
ఇక రాజస్థాన్ మ్యాచ్ లో నిరాశపరిచినా సీఎస్కే ఓపెనర్ కాన్వే 322 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
పర్పుల్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్, చైన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే 14 వికెట్లతోనే రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం.