Gautam Gambhir: రాజస్థాన్ రాయల్స్ నుంచి గౌతమ్ గంభీర్‌కు కీలక ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఇండియా క్రికెట్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెంటార్, సీఈవో లేదా స్ట్రాటజిక్ పార్టనర్ హోదాల్లో ఒకదాన్ని చేపట్టాలని ఆ ఫ్రాంఛైజీ ప్రతిపాదించినట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ వాటాలు చేతులు మారనున్న నేపథ్యంలో ఈ ఆఫర్ తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జాతీయ జట్టుకు కోచ్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో గంభీర్ ఈ ప్రతిపాదనను అంగీకరించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. బీసీసీఐతో ఉన్న ఒప్పందం ప్రకారం గంభీర్ 2027 ప్రపంచకప్ వరకు టీమిండియాకు హెడ్‌కోచ్‌గా కొనసాగనున్నాడు. అంతేకాక, ప్రస్తుతం 2026 టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో అతడు పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నాడు.
Details
గతంలో కేకేఆర్ కు మూడు టైటిళ్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర
భారత్ ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకున్న విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్ అనంతరం 2027లో వన్డే వరల్డ్‌కప్ కూడా ఉండటంతో, గంభీర్ జాతీయ జట్టుపైనే దృష్టి సారించే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో తిరిగి ఐపీఎల్‌లో బాధ్యతలు స్వీకరించే సూచనలు కనిపించడం లేదు. గంభీర్ గతంలో ఐపీఎల్‌లో ఆటగాడిగా విశేషంగా రాణించాడు. కేకేఆర్ మూడు టైటిళ్లు గెలుచుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. రెండుసార్లు కెప్టెన్‌గా, ఒకసారి మెంటార్‌గా జట్టును విజయవంతంగా నడిపించాడు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించి, అతడి మార్గదర్శకత్వంలో ఆ జట్టు వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి మూడోస్థానంలో నిలిచింది.