తదుపరి వార్తా కథనం
RCB: ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పటీదార్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 13, 2025
12:20 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కొత్త సారథిని ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
గత సీజన్‌లో ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను ఈసారి రిటైన్ చేయకపోగా, మెగా వేలంలో కూడా కొనుగోలు చేయలేదు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగుతున్నా, కెప్టెన్సీ బాధ్యతలను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
మరోవైపు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్య కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రజత్ పటీదార్‌కు ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.