పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ తొలగింపు
ఇంగ్లాడ్ తో జరిగిన టెస్టు సీరిస్ ను పాక్ 3-0 తో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే నాజామ్ సేథీ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని నియమించింది. సెప్టంబర్ 2021లో రమీజ్ రాజా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. పీసీబీ 36వ చైర్మన్‌గా ఉన్న ఎహసాన్ మణి ఆ పదవి నుంచి వైదొలగడంతో రాజా అప్పట్లో బాధ్యతలు చేపట్టారు. ఇజాజ్ బట్ (2008-11), జావేద్ బుర్కీ (1994-95), అబ్దుల్ హఫీజ్ కర్దార్ (1972-77) తర్వాత ఈ పదవికి నియమితులైన నాల్గవ మాజీ క్రికెటర్ రాజా..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా మూడోసారి నజామ్ సేథీ
సేథీ 2013-2018 మధ్య పీసీబీ చైర్మన్, సీఈఓగా ఉన్నారు. అయితే 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ విజయం సాధించిన వెంటనే ఆయన రాజీనామా చేశారు. మాజీ పాకిస్థాన్ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, హరూన్ రషీద్, షఫ్కత్ రాణా, మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్‌లతో కూడిన మేనేజ్‌మెంట్ కమిటీకి సేథీ నేతృత్వం వహించనున్నారు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ జారీ చేసిన ఉత్తర్వులపై ఫెడరల్ క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంది. అలా జరిగితేనే రమీజ్ రాజాను చైర్మన్ పదవి నుంచి తొలగించినట్లవుతుంది. అయితే , డిసెంబర్ 26 నుంచి కరాచీలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభంకు కొన్నిరోజుల ముందే పాక్ ప్రభుత్వం రాజాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.