
Ramiz Raja - Babar Azam: బాబర్ ఇన్నింగ్స్‌పై రమీజ్ విమర్శలు.. సోషల్ మీడియాలో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
సొంత జట్టు ఆటగాడు సరిగా ఆడకపోతే సీనియర్లు విమర్శించడం సహజం. నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాలని తరుచూ సూచిస్తుంటారు. కానీ పాకిస్థాన్ టీమ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. తమకు నచ్చని క్రికెటర్ ఎంత బాగా ఆడినా సరే, ఏదోఒక సాకు చూపి విమర్శించడం వారికి అలవాటు. తాజాగా అలాంటి సంఘటన పాక్ క్రికెట్‌లో చోటుచేసుకుంది. లాహోర్‌లో పాకిస్థాన్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరుగుతోంది. తొలి రోజు పాక్ జట్టు 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 93, కెప్టెన్ షాన్ మసూద్ - 76 (హాఫ్ సెంచరీ), సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ - 62*, సల్మాన్ అఘా - 52* రాణించారు.
Details
వివాదాస్పద ఇన్నింగ్స్
బాబర్ అజామ్ 23 పరుగులతో మంచి ప్రారంభం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలో, బాబర్ **ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 3,000కి పైగా పరుగులు చేసిన తొలి ఆసియా క్రికెటర్ అయ్యాడు. బాబర్ 1 పరుగులో ఉండగా, దక్షిణాఫ్రికా బౌలర్ ముతుసామి (48.1వ ఓవర్) వేసిన బంతిని ఆడటంలో విఫలమయ్యాడు. సఫారీ ఆటగాళ్లు అప్పీలు చేయగా, అంపైర్ ఔట్ ఇచ్చాడు. బాబర్ రివ్యూ తీసుకున్నాడు, సమీక్షలో నాటౌట్‌గా తేలింది.
Details
రమీజ్ రజా వ్యాఖ్యలు
కామెంటేటర్‌గా ఉన్న పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా మైక్ ఆఫ్‌లో ఉందని భావించి, బాబర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది కచ్చితంగా ఔటే. కానీ అతడు ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేస్తాడు. డీఆర్‌ఎస్ వృథానే అంటూ వ్యాఖ్యనించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సొంత జట్టు ఆటగాడి విషయంలో ఇలాగే వ్యాఖ్యలు చేయడం సరిగ్గా లేదని రమీజ్ రజాపై విమర్శలొస్తున్నాయి.