Loading...
Mohammed Shami: బెంగాల్ రంజీ జట్టులో షమీకి చోటు.. టీమిండియా రీఎంట్రీపై భారీ ఆశలు
బెంగాల్ రంజీ జట్టులో షమీకి చోటు.. టీమిండియా రీఎంట్రీపై భారీ ఆశలు

Mohammed Shami: బెంగాల్ రంజీ జట్టులో షమీకి చోటు.. టీమిండియా రీఎంట్రీపై భారీ ఆశలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఢిల్లీతో జరగనున్న తొలి మ్యాచ్ కోసం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB)తమ జట్టును ప్రకటించింది. స్టార్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. గత సీజన్‌లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీకి CAB కీలక బాధ్యతలు అప్పగించింది. అభిమన్యు ఈశ్వరన్‌కు డిప్యూటీగా సుదీప్ కుమార్‌ను నియమించింది.యువ ఆటగాళ్లు ప్రదీప్త ప్రామాణిక్, అంకుర్ పాల్, సుమంత్ గుప్తా కూడా జట్టులో చోటు సంపాదించారు. బెంగాల్ పేస్ విభాగం ఈసారి మరింత బలంగా కనిపిస్తోంది. మహ్మద్ షమీతో పాటు ఆకాశ్ దీప్,ముకేశ్ కుమార్,సూరజ్ సింధు జైస్వాల్,ఎండీ కైఫ్ జట్టులో ఉన్నారు.

వివరాలు 

షమీ రీఎంట్రీపై ఆసక్తి

మరోవైపు లైంగిక వేధింపుల కేసులో బెయిల్ పొందిన అభిషేక్ పోరెల్‌కు కూడా జట్టులో స్థానం కల్పించడం చర్చనీయాంశంగా మారింది.

మహ్మద్ షమీ ఇప్పటివరకు తన కెరీర్‌లో 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 384 వికెట్లు సాధించాడు.

రంజీ ట్రోఫీలో సత్తా చాటి మరోసారి భారత జాతీయ జట్టులోకి తిరిగి రావడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

భారత జట్టు ఎంపిక వ్యవహారంలో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

షమీ సహచరుడు, 'స్వింగ్ కింగ్'గా పేరున్న భువనేశ్వర్ కుమార్‌కు నాలుగేళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు లభించింది.

వివరాలు 

బెంగాల్ రంజీ ట్రోఫీ జట్టు:

దీంతో రంజీ ట్రోఫీలో షమీ అద్భుతంగా రాణిస్తే, అతనికి కూడా త్వరలోనే భారత జాతీయ జట్టు తలుపులు తెరుచుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సుదీప్ కుమార్ ఘరామీ (వైస్ కెప్టెన్), సుదీప్ చటర్జీ, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), షాకిర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), అంకుర్ పాల్, సుమంత గుప్తా, అంకిత్ శుక్లా, శుభమ్ చటర్జీ, మహమ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, సూరజ్ సింధు జైస్వాల్, ప్రదీప్త ప్రామాణిక్, అమీర్ గని, ఎండీ కైఫ్, సౌమ్యదీప్ మౌండల్.

ADVERTISEMENT