Mohammed Siraj : అరుదైన గౌరవం అందుకున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్రికెట్ మేగజీన్ 'విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్' 2026 ఎడిషన్ కవర్ పేజీపై సిరాజ్ ఫొటోను పబ్లిషర్లు ప్రచురించారు. ఇదే కవర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ చిత్రం కూడా చోటు దక్కించుకుంది. ఓవల్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చేతికి గాయం అయినప్పటికీ, కట్టుతోనే జట్టుకు అండగా నిలవడానికి మైదానంలోకి దిగిన వోక్స్ ఫొటోను ఈ సందర్భంగా ఉపయోగించారు. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ 2-2తో సమంగా ముగిసినా, చివరి టెస్టులో సిరాజ్ అద్భుత ప్రదర్శన కారణంగా భారత్ కేవలం 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వివరాలు
అత్యధికంగా 23 వికెట్లు
ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజున ఇంగ్లండ్ జట్టు విజయం కోసం 35 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా, సిరాజ్ మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఈ సిరీస్ మొత్తం మీద సిరాజ్ 32.43 సగటుతో అత్యధికంగా 23 వికెట్లు సాధించడం విశేషంగా నిలిచింది. తాజా విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ 2026 సంచిక ఏప్రిల్ 16న మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.