అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్
అప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ టీ20 కెప్టెన్ గా నియమితులయ్యారు. మహమ్మద్ నబీ స్థానంలో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు రషీద్ కు జట్టు పగ్గాలను అప్పగించింది. లెగ్‌స్పిన్నర్ రషీద్ 2019లో ఏడు T20లకు 2018-19లో ఏడు వన్డేలకు, 2019లో రెండు టెస్టులకు అప్పట్లో నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. "రషీద్ ఖాన్ ఈ పాత్రకు కొత్త కాదు. అంతకుముందు అన్ని ఫార్మాట్లో జట్టును సమర్థవంతంగా నడిపించాడు. ఇది అఫ్ఘానిస్తాన్ జట్టును కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది' అని అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అష్రాఫ్ అన్నారు.
దేశం గర్వపడేలా ఆడతాం
అప్ఘనిస్తాన్ కెప్టెన్ గా నియామకంపై రషీద్ మాట్లాడారు. 'కెప్టెన్సీ అనేది చాలా పెద్ద బాధ్యత. ఇందుకు ముందు దేశానికి వహించిన అనుభవముంది. జట్టు అంతా కలిసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తా, అలాదే దేశం గర్వపడేలా ఆడడానికి కృషి చేస్తాం అని చెప్పారు. అతని నాయకత్వంలో 7 టీ20ల్లో అప్ఘాన్ 4 విజయాలు చేసింది. మొత్తం అన్ని ఫార్మాట్లో కలిపి జట్టుకు 16 మ్యాచ్ ల్లో ఏడు విజయాలను అందించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అప్ఘనిస్తాన్ యూఏఈలో పర్యటించనుంది. అక్కడ 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.