Page Loader
టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్
టీ20ల్లో అరుదైన ఘనతను సాధించిన రషీద్ ఖాన్

టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రషీద్ ఖాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2023
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడిని పెంచగలడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ కి సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. షార్జా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20ల్లో అరుదైన ఘనతను సాధించాడు. టీ20లు అనగానే ఫోర్లు, సిక్సర్లుగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో రషీద్ ఖాన్ టీ20ల్లో బౌండరీ ఇవ్వకుండా 100 బంతులు వేసిన బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ రికార్డులకెక్కాడు. మూడో టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రషీద్‌ఖాన్ 31 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లోనే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్ సైమ్ ఆయూబ్.. రషీద్ ఖాన్ రికార్డ్‌కి తెరదించాడు.

రషీద్ ఖాన్

80 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 129 వికెట్లు తీసిన రషీద్ ఖాన్

అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా వరుసగా 100 లేదా అంతకంటే ఎక్కువ బంతుల్ని బౌండరీ ఇవ్వకుండా వేయలేకపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రషీద్ ఖాన్ రికార్డుని బద్దలు కొట్టడం కష్టమేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 80 మ్యాచ్‌లాడిన రషీద్ ఖాన్ 129 వికెట్లు పడగొట్టాడు మ్యాచ్ విషయానికొస్తే మూడో టీ20ల్లో 66 పరుగుల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఓటమిపాలైంది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌ 18.4 ఓవర్లలో 116 పరుగులు చేసి ఆలౌటైంది.