pakistan super league: ధోనీలాగా షాట్ కొట్టిన రషీద్ ఖాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 లో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై లాహోర్ ఖలందర్స్ భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 20 ఓవర్లలో 200/7 స్కోరు చేసింది. అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 45 పరుగులు చేశాడు. లక్ష్య చేధనకు దిగిన ఇస్లామాబాద్ 13.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. ఖలందర్స్ తరఫున డేవిడ్ వీస్ మూడు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, సికందర్ రజా రెండేసి వికెట్లు తీశారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్‌ఖాన్ 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరపును అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న T20 లీగ్‌లలో మంచి నైపుణ్యంతో వికెట్లు తీస్తూ ఆల్ రౌండర్‌గా గుర్తింపును తెచ్చుకున్నాడు.
ధోనిని గుర్తు చేసిన రషీద్ ఖాన్
అయితే ఈ మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు రషీద్ ఖాన్.. టామ్ కుర్రాన్ వేసిన 19 ఓవర్లలోని మూడో బంతికి అద్భుతమైన సిక్సర్‌ను కొట్టాడు. ఈ షాట్ ఎంఎస్ ధోనిని గుర్తు చేసింది. ధోని స్టైల్‌లో రషీద్ ఖాన్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. దీంతో బంతి నేరుగా స్టాండ్‌లోకి వెళ్లిపోయింది. రషీద్ SA20 లీగ్‌లో MI కేప్ టౌన్ తరపున అతి తక్కువ ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. టీ20ల్లో 500 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో మాత్రమే.