
Rashid Khan: ఆసియా క్రికెట్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ అభిమానులకి బాగా పరిచయం అయిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన కెరీర్‌లో మరొక అద్భుతమైన ఘనతను అందుకున్నాడు. అఫ్గానిస్థాన్‌కు చెందిన ఈ బౌలర్ ఆసియా క్రికెట్ చరిత్రలో సూపర్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఘనత అది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. ఇంతకీ అదేంటంటే? తాజాగా బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్ ఆడుతోంది. ఆ సిరీస్‌లో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. దీంతో రషీద్ ఖాన్ వన్డే ఫార్మాట్‌లో 200కి పైగా వికెట్లు తీసిన తొలి అఫ్గాన్ బౌలర్‌గా అరుదైన ఘనత సాధించారు.
వివరాలు
ఐపీఎల్‌లో కూడా రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన
ఇది కేవలం 115 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలోనే సాధించిన రికార్డు. రషీద్ తర్వాతి స్థానంలో మహ్మద్ నబీ (174 మ్యాచుల్లో 176 వికెట్లు) ఉన్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ సాధించిన రికార్డు ఆసియా క్రికెట్ చరిత్రలో ప్రత్యేకత కలిగిస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (వన్డేలు, టీ20లు) రషీద్ ఖాన్‌నే 200+ వికెట్లు, 150+ వికెట్లు సాధించిన ఏకైక బౌలర్. ఇటు ఐపీఎల్‌లోనూ 150+ వికెట్లు పడగొట్టడం గమనార్హం. అంతర్జాతీయ టీ20ల్లో 179 వికెట్లు, ఐపీఎల్‌లో 158 వికెట్లు తీశాడు.
వివరాలు
బంగ్లాపై అద్భుత విజయం..
అబుదాబీ వేదికగా అఫ్గానిస్థాన్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది.ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 48.5 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటయింది. కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (60) తౌహిద్ హృదోయ్ (56) అర్ధశతకాలను సాధించారు. రషీద్ 3, అజ్మతుల్లా 3, ఘజన్‌ఫర్ 2, ఖరోటె 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్ (50) రహ్మత్ షా (50) అర్ధశతకాలతోపాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ (40) హష్మతుల్లా షాహిది (33* నాటౌట్) సత్తా చాటారు. చివరకు 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి,అఫ్గానిస్థాన్ 226 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో అఫ్గాన్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.