LOADING...
Rassie van der Dussen : అంతర్జాతీయ క్రికెట్‌కు రాస్సీ గుడ్‌బై.. సౌతాఫ్రికాకు పెద్ద దెబ్బ
అంతర్జాతీయ క్రికెట్‌కు రాస్సీ గుడ్‌బై.. సౌతాఫ్రికాకు పెద్ద దెబ్బ

Rassie van der Dussen : అంతర్జాతీయ క్రికెట్‌కు రాస్సీ గుడ్‌బై.. సౌతాఫ్రికాకు పెద్ద దెబ్బ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 02, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ రాస్సీ.. తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 37 ఏళ్ల వయస్సులో అతను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, దేశీయ క్రికెట్‌లో లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దక్షిణాఫ్రికా జెర్సీ ధరించడం తన జీవితంలో అత్యంత మధురమైన అనుభవమని అతను పేర్కొన్నాడు. అది తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. తన క్రికెట్ ప్రయాణం పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పాడు. దేశానికి ఆడే అవకాశం తనకు దక్కిన అతి పెద్ద గౌరవమని వెల్లడించాడు. భవిష్యత్తులో కూడా దక్షిణాఫ్రికా క్రికెట్ అభివృద్ధికి తాను సహకరించడానికి సిద్ధంగా ఉంటానని తెలిపాడు.

వివరాలు 

ప్రపంచ కప్‌కు ముందు భారీ షాక్

2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దక్షిణాఫ్రికా తరఫున మొత్తం 71 వన్డేలు, 18 టెస్టులు, 57 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో 30.2 సగటుతో 905 పరుగులు సాధించగా, అందులో 6 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో అతను 50.1 సగటుతో 2657 పరుగులు చేసి, 6 శతకాలు, 17 అర్ధశతకాలు నమోదు చేశాడు. టీ20ల్లో 33.5 సగటుతో 1406 పరుగులు సాధించి, 10 అర్ధశతకాలు కొట్టాడు. అదనంగా ఐపీఎల్‌లో కూడా మూడు మ్యాచ్‌లు ఆడి, 11 సగటుతో 22 పరుగులు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు అతను రిటైర్మెంట్ ప్రకటించడం దక్షిణాఫ్రికా జట్టుకు ఒక పెద్ద నష్టంగా భావించవచ్చు.

Advertisement