Page Loader
టీమిండియా దెబ్బకు కొత్త బౌలర్లను దించిన పాకిస్థాన్ 
టీమిండియా దెబ్బకు కొత్త బౌలర్లను దించిన పాకిస్థాన్ టీమిండియా దెబ్బకు కొత్త బౌలర్లను దించిన పాకిస్థాన్

టీమిండియా దెబ్బకు కొత్త బౌలర్లను దించిన పాకిస్థాన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2023
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో భాగంగా నిన్న సూపర్-4 మ్యాచులో పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించింది. నిన్నటి మ్యాచులో భారత బ్యాటర్లు చెలరేగడంతో భారత జట్టు ఏకంగా 228 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక భారత బ్యాటర్ల జోరు ముందు ఇద్దరు పాకిస్థాన్ బౌలర్లకు గాయలయ్యాయి. నిన్నటి మ్యాచులో ప్రధాన పేసర్లు నజీమ్ షా, హారిస్ రౌఫ్ నిన్నటి మ్యాచులో గాయం కారణంగా బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో వీరిద్దరి స్థానంలో మరో ఇద్దరు పేసర్లను బ్యాకప్‌గా స్క్వాడ్ లోకి పాకిస్థాన్ జట్టు చేర్చుకుంది. షహనవాజ్ దహాని, జమాన్ ఖాన్ లను బ్యాకప్ బౌలర్లుగా తీసుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది.

Details

హరిశ్, నసీమ్ ఆసియా కప్ కు దూరం!

ఇక ఆసియా కప్ సమయంలోనే హరిశ్, నసీమ్ లను మెడికల్ బృందం పర్యవేక్షనుంది. ఒకవేళ వారిద్దరూ మరో వారం పాటు దూరమైతే అప్పుడు ఆసియన్ క్రికెట్ మండలి సహకారంతో ఇద్దరు కొత్త బౌలర్లను మైదానంలోకి దించనున్నట్లు పాక్ క్రికెట్ తెలిపింది. నసీమ్ వేలికి గాయం కాగా, రౌఫ్ ఛాతి కండరాల్లో వాపు వచ్చింది. వచ్చే నెలలో వరల్డ్ కప్ ఉండటంతో వీరిద్దరిని ఆసియా కప్‌కు దూరంగా ఉంచాలని పాక్ యాజమాన్యం భావిస్తోంది.