డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి
ప్రస్తుతం ఐపీఎల్ చివరి మ్యాచులు జరుగుతున్నాయి. వీటి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే టీమిండియా తొలి బ్యాచ్ ఇంగ్లండ్ కుపయనమైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో తలపడే భారత్ ప్లెయింగ్ ఎలెవన్ ను భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎంపిక చేశాడు. తన జట్టులో అంజిక్యా రహానేకు అవకాశం కల్పించాడు. లండన్ లోని ఓవల్ లో ఈ డబ్య్లూటీసీ ఫైనల్ జరగనుంది. అయితే ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన రహానేకు ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే.
రవిశాస్త్రి అంచనా వేసిన జట్టు ఇదే
ఇక రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మాన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరం కావడంతో అతని స్థానంలో కీపింగ్ బాధ్యతలను కేఎస్ భరత్ కు అప్పగిస్తారని వెల్లడించారు. టీమిండియాకు కీలకమైన నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, అయితే శార్దూల్ మాత్రం ఆల్ రౌండర్‌గా బరిలోకి దిగుతాడని చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రి అంచనా వేసిన ఇండియా ప్లేయింగ్ XI ఇదే.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.