
IPL 2023: ఐపీఎల్ టోర్నీ విజేత మళ్లీ గుజరాతే : రవిశాస్త్రి
ఈ వార్తాకథనం ఏంటి
2022 ఐపీఎల్ ట్రోఫీ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సీజన్ లో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది.
గతేడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా ఓ కొత్త జట్టుగా బరిలోకి దిగి ఏకంగా ట్రోఫీని ఎగరేసుకొనిపోయింది. ప్రస్తుతం సీజన్ లో ఆ జట్టు అద్భుతంగా రాణిస్తోంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ ఐపీఎల్ 2023 విజేత ఎవరో స్పష్టం చేశారు.
ఐపీఎల్ లో గుజరాత్ జట్టు నిలకడగా రాణిస్తోందని, మళ్లీ ఆ జట్టే ట్రోఫీ గెలిచే అవకాశం ఉందని రవిశాస్త్రీ వెల్లడించారు.
Details
సంజు శాంసన్ కెప్టెన్ గా పరిణితి చెందాడు
ప్రస్తుతం గుజరాత్ జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తోందని, ఏడెనిమిది ప్లేయర్లు నిలకడగా రాణిస్తున్నారని రవిశాస్త్రి స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ సంజూశాంసన్ పై రవిశాస్త్రీ ప్రశంసలు కురిపించాడు. శాంసన్ కెప్టెన్ గా పరిణితి చెందాడని, ఓ మంచి కెప్టెన్ గా ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపి వాళ్లను తెలివిగా వాడుకుంటాడని అన్నాడు.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్ లలో 12 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
ఇదిలా ఉండగా.. గుజరాత్ తన చివరి మ్యాచ్ లో పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ చేతుల్లో పరాజయం పాలైంది. అంతకుముందు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన గుజరాత్ కు ఢిల్లీ షాకిచ్చింది.