
ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
20వ ఓవర్‌లో ఇషాంత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ లక్ష్యం వేటలో వెనకపడిపోయింది.
59పరుగులతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పోరాడినా విజయం వార్నర్ టీమ్‌నే వరించింది.
చివర్లో రాహుల్ తెవాటియా సిక్సులతో మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింంది. ఢిల్లీ నిర్దేశించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ బ్యాటర్లు తడబడ్డారు.
గజరాత్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది.
దీంతో 5పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ జట్టు విజయకేతనం ఎగరవేసింది.
ఢిల్లీ జట్టులో ఖలీల్, ఇషాంత శర్మ 2వికెట్ల చొప్పున తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
5 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఢిల్లీ విజయం
Match 44. Delhi Capitals Won by 5 Run(s) https://t.co/VQGP7wSZAj #TATAIPL #GTvDC #IPL2023
— IndianPremierLeague (@IPL) May 2, 2023