కోహ్లీ, గంభీర్ గొడవపై రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఎప్పటి నుంచో విబేధాలు ఉన్నాయి. లక్నో, బెంగళూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ మాటల యుద్ధానికి దిగారు.
జెంటిల్ మెన్ గేమ్ ను కాస్త గల్లీ స్థాయి ఆటకు తీసుకొచ్చారని మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.
సునీల్ గవాస్కర్ అయితే ఏకంగా ఇద్దరినీ సస్పెండ్ చేయాలని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తాజాగా ఈ విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రీ స్పందించాడు. కోహ్లీ, గంభీర్ కూర్చొని మాట్లాడుకోవాలని, సమస్యకు ఇంతటితో పులిస్టాప్ పెట్టాలని చెప్పాడు.
Details
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు : రవిశాస్త్రీ
ఈ వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం అవుతుందని, ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్లో రాణించారని, గౌతమ్ గంభీర్ రెండుసార్లు ప్రపంచ కప్ విన్నర్ అని, విరాట్ కోహ్లీ కూడా ఐకాన్ అని, ఇద్దరు ఢిల్లీ నుంచే వచ్చారని, సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని రవిశాస్త్రి సూచించాడు.
సమస్య పెద్ద కాకుండా ఇంతటితో ముగించాలని, ఇలాంటి గొడవ మళ్లీ జరగడం తనకు ఇష్టం లేదని, ఈ అంశాన్ని ముగించడానికి ఎవరు ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిదని తెలియజేశాడు.
అయితే మైదానంలో ఇలాంటి ఘటనకు కారణమైన గంభీర్, కోహ్లీ, నవీన్ పై ఐపీఎల్ యాజమాన్యం కోడ్ ఆఫ్ నిబంధనల పేరుతో వారి మ్యాచ్ ఫీజులో 100శాతం జరిమానా విధించింది.