LOADING...
ప్లేయర్స్ నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నారని రవిశాస్త్రి ఫైర్
దీపక్ చాహర్ పై మండిపడ్డ రవిశాస్త్రి

ప్లేయర్స్ నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నారని రవిశాస్త్రి ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2023
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆటగాళ్లు తరుచూ గాయలపాలవుతూ మ్యాచ్ లకు దూరమవుతున్నారు. గాయం పేరుతో స్టార్ ఆటగాళ్ల మ్యాచ్ లకు దూరం కావడంతో ఆ జట్టు గెలుపుపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పేసర్లు ఎక్కువగా గాయాల భారీనపడుతున్నారు. కనీసం నాలుగు మ్యాచ్ లు ఆడక మునుపే గాయాలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం చైన్నై తరుపున ఐపీఎల్ లో ఆడుతున్న దీపక్ చాహర్, ముంబై మ్యాచ్ లో గాయపడి తర్వాతి మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇప్పటికే సీఎస్కే కి కైల్ జెమీషన్, ముఖేష్ చౌదరి గాయం భారీన పడ్డారు. దీంతో ఆ జట్టు విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.

రవిశాస్త్రి

దీపక్ చాహర్‌పై అగ్రహం వ్యక్తం చేసిన రవిశాస్త్రి

కొందరు క్రికెట్లరు నేషనల్ క్రికెట్ అకాడమీ కు శాశ్వత సభ్యులగా జాయిన్ అయ్యారని, కొందరు ఆటగాళ్లు ఏన్సీఏలో పర్మనెంట్ సభ్యులయ్యారని, త్వరలో వారు అక్కడ నివాసం ఏర్పరచుకుంటే మంచిదని రవిశాస్త్రి చురకలంటించాడు. ఐపీఎల్ లో నాలుగు ఓవర్లు వేయగానే ప్లేయర్ల పని అయిపోతోందని, కేవలం మూడు గంటలు జరిగే మ్యాచ్ లో ఇలా గాయపడడం తనకు చిరాకు తెప్పిస్తోందని ఆయన మండిపడ్డారు. అయితే చిన్న చిన్న గాయాలకు కూడా పదే పదే ఎస్సీఎకు వెళ్లిరావడం కరెక్ట్ కాదని ఆయన సూచించారు.