Ravichandran Ashwin: క్రికెట్ ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. గబ్బా టెస్టు అనంతరం 38 ఏళ్ల అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. తన ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు, అశ్విన్, టీమ్ మేటు విరాట్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగంగా కలిసి హాగ్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అశ్విన్ 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టి, 15 ఏళ్లపాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసిన అశ్విన్, 3503 పరుగులు చేయడం ద్వారా 6 సెంచరీలు సాధించాడు. 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.