Page Loader
R Ashwin: టీమిండియాకు షాక్.. అకస్మాత్తుగా మూడో టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్ 
R Ashwin: టీమిండియాకు షాక్.. అకస్మాత్తుగా మూడో టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్

R Ashwin: టీమిండియాకు షాక్.. అకస్మాత్తుగా మూడో టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్ 

వ్రాసిన వారు Stalin
Feb 17, 2024
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు నుంచి స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. మూడో టెస్టులో భాగంగా శుక్రవారం అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 500వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఒక రోజు వ్యవధిలోనే ఆట నుంచి తన పేరును ఉపసంహరించుకోవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. టీమ్ నుంచి తప్పుకోవడం బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది. "ఈ తీవ్రమైన పరిస్థితిలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి, సహచరులు, సిబ్బందితో సహా సభ్యులందరూ అశ్విన్, అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తున్నారు" అని ట్విట్టర్‌లో పేర్కొంది. దీన్ని బట్టి కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ జట్టు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమైంది. అతని స్థానంలో ప్లేయింగ్-11లో ఎవరిని తీసుకుంటారనేది మాత్రం ప్రకటించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ ట్వీట్