
IPL 2025: ఐపీఎల్ చరిత్రలో సృష్టించిన రవీంద్ర జడేజా
ఈ వార్తాకథనం ఏంటి
వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని సాధించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున అతనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా మే 7న కోలకతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తన కోటాలో నాలుగు ఓవర్లు పూర్తి చేసిన జడేజా,కీలకమైన రహానే వికెట్‌ను పడగొట్టాడు.
ఈ వికెట్‌తో అతడు డ్వేన్ బ్రావో రికార్డును అధిగమించి సీఎస్‌కేకు ఆల్‌టైమ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా మారాడు.
ఇప్పటి వరకు సీఎస్‌కే తరఫున జడేజా 184 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు తీసాడు. ఇక బ్రావో 116 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు.
వివరాలు
సీఎస్‌కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా
141 వికెట్లు - రవీంద్ర జడేజా (184 మ్యాచ్‌లు)
140 వికెట్లు - డ్వేన్ బ్రావో (116 మ్యాచ్‌లు)
95 వికెట్లు - ఆర్. అశ్విన్ (104 మ్యాచ్‌లు)
76 వికెట్లు - దీపక్ చాహర్ (76 మ్యాచ్‌లు)
76 వికెట్లు - ఆల్బీ మోర్కెల్ (78 మ్యాచ్‌లు)
60 వికెట్లు - శార్దూల్ ఠాకూర్ (57 మ్యాచ్‌లు)
58 వికెట్లు - మోహిత్ శర్మ (48 మ్యాచ్‌లు)
వివరాలు
మ్యాచ్ వివరాల్లోకి వెళితే:
టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, వారిని ఎక్కువ పరుగులు చేయకుండా చెన్నై బౌలర్లు నియంత్రించారు.
నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది.
నూర్ అహ్మద్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 4 వికెట్లు తీశాడు. అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
బ్యాటింగ్‌లో కేకేఆర్ తరఫున రహానే 48 పరుగులు చేయగా, రసెల్ 38 పరుగులు చేసి మంచి మద్దతిచ్చాడు.
మనీశ్ పాండే 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక నరైన్ 26, గుర్భాజ్ 11, రఘువంశీ 1, రింకూ సింగ్ 9 పరుగులు చేసి అవుటయ్యారు.
వివరాలు
సీజన్ పరిస్థితి విషయానికి వస్తే:
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ పోటీ నుంచి తప్పుకుంది.
11 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
మరోవైపు కోలకతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ ఆశలను ఇంకా నిలుపుకుంది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి 11 పాయింట్లు పొందింది
ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అదనంగా ఒక పాయింట్ లభించింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే కేకేఆర్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.