Page Loader
IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే! 
IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే!

IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే! 

వ్రాసిన వారు Stalin
Jan 29, 2024
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0తో ముందంజలో ఉంది. తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడటం అనుమానంగానే ఉంది. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 వరకు విశాఖపట్నంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు జడేజా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. జడేజా ప్రస్తుతం కండరాల నొప్పితో బాధపడుతుండటమే ఇందుకు కారణం.

టీమిండియా

ఫిజియోతో మాట్లాడిన తర్వాతే చెప్తా: కోచ్ ద్రవిడ్

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆదివార రవీంద్ర జడేజా పరుగు తీసే క్రమంలో కండరాలు పట్టేశాయి. నొప్పి కారణంగా అదనపు పరుగు తీయలేక.. రనౌట్ కూడా అయ్యారు. మైదానాన్ని వీడే సమయంలో కూడా జడేజా చాలా ఇబ్బంది పడుతూనే బయటకు వెళ్లారు. ఈ క్రమంలో అతను రెండో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. జడేజా కండరాల నొప్పిపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. ఫిజియోతో మాట్లాడిన తర్వాత అతని పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుందన్నారు. ఇదిలా ఉంటే.. జడేజా గాయంపై బీసీసీఐ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.