సీఎస్కే ఫ్యాన్స్ పై రవీంద్ర జడేజా అగ్రహం.. ఏకంగా ట్విట్‌తో సమాధానం
ఈ వార్తాకథనం ఏంటి
చైన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ఒకరు. ఈ సీజన్లో చైన్నై విజయాల్లో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచులోనూ రవీంద్ర జడేజా సత్తా చాటాడు.
4 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఏకంగా రెండు కీలక వికెట్లు తీశాడు. గుజరాత్ పై చైన్నై విజయం సాధించడంతో సీఎస్కే పదోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది.
తాజాగా జడేజా కొన్ని పోస్టులతో పాటు వివాదాస్పద పోస్టులకు చేస్తున్న లైక్స్ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చైన్నై అభిమానులపై జడేజా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ధోని బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్న ఓ అభిమాని అతడు ఔట్ కావాలని అరవడం జడ్డూను బాధించింది.
Details
జడేజాను గుర్తించని సీఎస్కే ఫ్యాన్స్
అయితే ఆ వ్యక్తి చేసిన వివాదాస్పద పోస్టుకు జడేజా లైక్ కొట్టాడు. దీన్ని జడేజా లైక్ చేయడంపై ధోని, సీఎస్కే జట్టుతో జడేజాకు ఇంకా పడటం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన జడేజాకు 'అప్ స్టాక్' అనే బ్రోకరేజీ సంస్థ 'మోస్ట్ వాల్యూబుల్ అస్సెట్ ఆప్ ద మ్యాచ్' గా గుర్తించి లక్ష నగదును అందించింది.
అయితే దీనిపై జడేజా అప్ స్టాక్స్ కు తెలుసు కానీ కొందరు అభిమానులకే తెలియడం లేదంటూ ట్విట్ చేశాడు. దీంతో చైన్నై ఫ్యాన్స్ తనను గుర్తించడం లేదన్న అసహనాన్ని జడేజా వ్యక్తం చేసినట్టయింది.