Page Loader
WPL 2024: ఎల్లిస్ పెర్రీ విధ్వంసం .. ప్లేఆఫ్స్‌లో బెంగళూరు 
WPL 2024: ఎల్లిస్ పెర్రీ విధ్వంసం .. ప్లేఆఫ్స్‌లో బెంగళూరు

WPL 2024: ఎల్లిస్ పెర్రీ విధ్వంసం .. ప్లేఆఫ్స్‌లో బెంగళూరు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2024
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలిస్‌ పెర్రీ బంతితో, బ్యాటుతో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో మంగళవారం బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో ఆర్‌సిబి లీగ్‌ దశను ముగించుకుని మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఎలీస్‌ పెర్రీ(6/15)బౌలింగ్‌ ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 19ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు 15ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నిఛేదించింది. ఈ మ్యాచ్‌లో పెర్రీ జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టడమే కాకుండా అత్యధిక పరుగులు కూడా చేసింది. పెర్రీ నాలుగు ఓవర్లలో 15పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసింది.WPL చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన పెర్రీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Details 

ఎలిస్‌ పెర్రీ బంతితో, బ్యాటుతో తిరుగులేని ప్రదర్శన

బంతితో విధ్వంసం సృష్టించిన పెర్రీ తన బ్యాట్‌తో కూడా విధ్వంసం సృష్టించింది. పెర్రీ 38 బంతుల్లో ఐదు ఫోర్లు,ఒక సిక్సర్‌తో 40 పరుగులు చేసింది .రిచా ఘోష్‌తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చింది. రిచా 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో అజేయంగా 36 పరుగులు చేసింది.స్మృతి మంధాన 13 బంతుల్లో 11 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పెర్రీ నిప్పులు చెరిగే బంతులతో విధ్వంసం సృష్టించడంతో ముంబై బ్యాట్స్‌మెన్‌లకు వికెట్‌పై పట్టు సాధించడం కష్టంగా మారింది. ముంబై కోల్పోయిన మొదటి ఏడు వికెట్లలో పెర్రీ తన వంతు సహకారం అందించింది.

Details 

మొదటి స్థానం కోసం ఢిల్లీ, ముంబై మధ్య పోరు

ఈ లీగ్‌లో, మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ను ఆడగా, రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో ఎలిమినేటర్ ఆడుతుంది. ఈ ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది. మొదటి స్థానం కోసం ఢిల్లీ, ముంబై మధ్య పోరు సాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబై రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ తన చివరి మ్యాచ్‌ని బుధవారం గుజరాత్ జెయింట్స్‌తో ఆడాల్సి ఉంది. దీని తర్వాత నంబర్ వన్ జట్టు అధికారిక ప్రకటన వెలువడనుంది.