LOADING...
RCB: ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుస విజయాలు నమోదు
ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుస విజయాలు నమోదు

RCB: ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుస విజయాలు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) 2026లో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఈ సీజన్లో ఐదో వరుస విజ‌యాన్ని సాధిస్తూ ఆర్‌సీబీ ఘనంగా ప్లే ఆఫ్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇదే సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కి అడుగుపెట్టిన మొదటి జట్టు కూడా అయింది. సోమవారం గుజరాత్ జెయింట్స్‌ను ఓడించడం ద్వారా ఈ ఘనతను తన సొంతం చేసుకుంది. మ్యాచ్ వివరాల విషయానికి వస్తే, మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

Details

రాణించిన గౌతమి నాయక్

గౌతమి నాయక్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 73 రన్స్ హాఫ్ సెంచరీతో రాణించగా, కెప్టెన్ స్మృతి మంధాన 26, వికెట్ కీపర్ రిచా ఘోష్ 27 పరుగులు చేశారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో కాష్వీ గౌతమ్, ఆష్లీ గార్డనర్ ఇద్దరూ రెండు వికెట్లు తీశారు, రేణుకా సింగ్ ఠాకూర్ మరియు సోఫీ డెవిన్ ఒక్కో వికెట్ సాధించారు. తరువాత గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఆష్లీ గార్డనర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 54 పరుగులు చేసి రాణించినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.

Details

61 పరుగుల తేడాతో విజయం

దాంతో గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 117 పరుగులు మాత్రమే సాధించింది. ఈ గణాంకాల ప్రకారం, ఆర్‌సీబీ 61 ప‌రుగు తేడాతో ఘన విజ‌యాన్ని నమోదు చేసుకుంది. ఆర్‌సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే మూడు వికెట్లు, నాడిన్ డి క్లర్క్ రెండు వికెట్లు తీశారు. లారెన్ బెల్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ ఒక్కో వికెట్ సాధించారు.

Advertisement