
RCB vs CSK: ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆర్సీబీ పోరాటం.. చెన్నైతో నేడు కీలక మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకునే లక్ష్యంతో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది.
ఇక భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఒకరినొకరు ఎదుర్కొనే చివరి అవకాశంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది అభిమానుల్లో పెద్ద స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ రోజు గెలిస్తే ఆర్సీబీ పాయింట్లను 16కి చేరించుకుని ప్లేఆఫ్‌లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికీ ఆర్సీబీ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై ఈసారి నిలదొక్కుకోలేకపోయింది.
Details
అద్భుత ఫామ్ లో కోహ్లీ
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ధోని, కోహ్లీపైనే ఉంది. కోహ్లీ ఈ సీజన్‌లో 443 పరుగులతో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నారు.
ఆర్సీబీ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. చెన్నై బౌలింగ్ విభాగంలో పేసర్ ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ నూర్ అహ్మద్ మాత్రమే ప్రభావం చూపగలిగారు.
బ్యాటింగ్‌లో చెన్నై ఆశలు ఆయుష్ మాత్రే, సామ్ కుర్రాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబేలపై ఉన్నాయి.
చివరి ఓవర్లలో ధోని ధాటిగా ఆడుతూ స్కోర్‌ను పెంచే అవకాశముంది. ఇప్పటికే చెన్నైపై ఆర్సీబీ ఓ విజయం నమోదు చేసింది.
Details
రెండో స్థానంలో ఆర్సీబీ
చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆర్సీబీకి 2008 తర్వాత సీఎస్‌కేపై వచ్చిన తొలి గెలుపు అది. ఇప్పుడు అదే జట్టును మరోసారి ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని ఆర్సీబీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
ఇక చెన్నై మాత్రం 10 మ్యాచ్లలో కేవలం రెండు గెలవగలిగింది. ఎనిమిది ఓటములతో 10వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ధోని జట్టు తమ జెర్సీకి గౌరవంగా పోరాడేందుకు ప్లేయింగ్-11లో మార్పులు చేసే అవకాశం ఉంది.