LOADING...
RCB Name Change: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. జట్టు పేరులో పెద్ద మార్పు.. కొత్త యాజమాన్యం ప్లాన్ ఇదే
ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. జట్టు పేరులో పెద్ద మార్పు.. కొత్త యాజమాన్యం ప్లాన్ ఇదే

RCB Name Change: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు షాక్.. జట్టు పేరులో పెద్ద మార్పు.. కొత్త యాజమాన్యం ప్లాన్ ఇదే

వ్రాసిన వారు Moogati Shabari
Mar 27, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ప్రాచుర్యం పొందిన జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ ఇటీవల యాజమాన్యం మారింది. ఈ జట్టును భారీ సంస్థల సమూహం స్వాధీనం చేసుకుంది. ఇందులో ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ వంటి సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ కన్సార్టియం సుమారు రూ.16,706 కోట్లకు ఆర్‌సీబీని కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు డియాజియో ఆధీనంలో ఉన్న ఈ జట్టు, ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తరువాత కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జట్టు పేరును మార్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

వివరాలు 

కొత్త యాజమాన్యం..కొత్త పేరు

కొత్త యాజమాన్యం అయిన బిర్లా గ్రూప్ ప్రస్తుతం ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పేరు తమ బ్రాండ్ ప్రతిష్టకు సరిపోవడం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జట్టుకు కొత్త పేరు ఇవ్వాలనే ప్రణాళికలో ఉన్నారని చెబుతున్నారు. 'రాయల్ కన్నడిగన్స్ బెంగళూరు' (ఆర్‌కేబీ) అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది నిజమైతే, ఐపీఎల్ చరిత్రలోనే ఒక పెద్ద గుర్తింపు మార్పుగా నిలిచే అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఆర్‌సీబీ పేరుతో అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ జట్టు పేరు మారితే, అభిమానులకు ఇది ఆశ్చర్యంగా మారవచ్చు.

వివరాలు 

కర్ణాటకకు చెందిన పేరు ఉండేలా ప్లాన్

'రాయల్ కన్నడిగన్స్ బెంగళూరు' అనే పేరుతో స్థానికతను మరింత బలపరచాలని కొత్త యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన అభిమానులతో మరింత అనుబంధం పెంచేందుకు ఈ మార్పు ఉపయోగపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. జట్టు పేరు నిజంగా మారుతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. అయినప్పటికీ, ఆర్‌సీబీ పేరు మార్పు అంశం ఐపీఎల్ అభిమానుల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.

Advertisement